ఇంకుడు గుంతలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలు తప్పనిసరి

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

హత్నూర(సంగారెడ్డి): ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఎల్‌పీఓ అనిత, ఏపీడీ మధులత తెలిపారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని చింతలచెరువు పంచాయతీ సర్పంచ్‌ మమత నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీబీజీ రామ్‌ జీ పథకాన్ని పంచాయతీలు పకడ్బందీగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇంటి వద్ద ప్రత్యేకంగా ఇంకుడు గుంత, పొలం వద్ద ప్రత్యేకంగా భారీ గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా తయారుచేసి రైతులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామసభలో ఏపీఓ ప్రవీణ్‌, గ్రామ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement