కార్యకర్త బాగోగులు తెలుసుకున్న
మంత్రి దామోదర
వట్‌పల్లి(అందోల్): ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల నిర్వహణలో ఎప్పుడు బిజీగా ఉండే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పార్టీ కార్యకర్త అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని వెంటనే ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందోల్ మండలం కన్‌సాన్‌పల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బేగరి మాణెమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై సరిగా నడవలేక ఇంటి వద్దనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కొంటోంది. శుక్రవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసిన సందర్భంలో మాణెమ్మ ఎలా ఉంది అంటూ మంత్రి వారిని అడగగా ఆమె అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. మంత్రి వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాణెమ్మ బాగున్నావా..? ఆరోగ్యం ఎలా ఉందంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పీలిస్తే రోగాలే
పటాన్‌చెరు: బొల్లారం పారిశ్రామిక వాడ నుంచి వెలువడుతున్న పొగ, రసాయనాలతో అమీన్‌పూర్, పటాన్‌్‌చెరు కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఘాటైన వాసన వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సింఫోనీ కాలనీ పరిసరాల్లో ఒక్కసారిగా ఘాటైన రసాయన వాసన వ్యాపించింది. దీంతో పలువురు నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాలుష్య మానిటర్‌లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 158గా నమోదైంది. సింఫనీలో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ఏయిర్ క్వాలిటీ మానిటర్ నమోదైన రికార్డులను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయని స్పష్టమవుతుంది.
నారాయణఖేడ్: వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని కురుమ సంఘం డివిజన్ అధ్యక్షుడు లొండె నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖేడ్ ఆక్సిజన్ పార్కులో శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తొలి అమ రుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టి ఆయన త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నర్సింలు, డాక్టర్ ఓంప్రకాష్, సర్పంచ్‌లు, సుభాశ్, చంద్రబోస్, నగేశ్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
కొల్చారం(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘వీబీజీ రామ్‌జీ‘ ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం చేకూరుతుందని డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


