గ్రామస్థాయిలో జీపీఓల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయిలో జీపీఓల పాత్ర కీలకం

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

డీసీసీ మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి

సంగారెడ్డి: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జీపీఓలు కీలక అనుసంధానకర్తలుగా పనిచేస్తున్నారని డీసీసీ మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన జీపీఓల ప్రథమ మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జీపీఓల పాత్ర కీలకమన్నారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను తొలగించిందని, దీంతో గ్రా మస్థాయిలో కీలకమైన సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన అనంతరం గ్రామ పాలనాధికారులుగా నియమించి వారి సేవలను వినియోగించుకుంటోందని తెలిపారు. జీపీఓల సమస్యలు, డిమాండ్లను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement