పత్తి రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు దిగాలు

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

వర్షాభావంతో తగ్గిన కాత

వర్షాభావ పరిస్థితులు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆశించిన కాత, పూతకు నోచుకోక మొక్కలు ఎండుముఖం పట్టాయి. దీంతో దిగుబడిపై రైతులు దిగాలు చెందుతున్నారు. – రాయికోడ్‌(అందోల్‌)

తొలకరి వర్షాలతో ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులకు వర్షాలు ముఖం చాటేయడంతో ఆదిలోనే నిరాశకు గురయ్యారు. అడపాదడపా వర్షాలతో పంటను కాపాడుకుంటూ వచ్చారు. తీరా పూత, కాత సమయంలో సుమారు 25 రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో కాత మందగించింది. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి ఆశించిన రైతులు అందులో సగం కూడా దిగుబడి రాకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతామనే ఆందోళనలో ఉన్నారు. వారం రోజులుగా పలువురు రైతులు పత్తితీత ప్రారంభించారు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లే దిగుబడి వస్తోందని వాపోతున్నారు. ఎకరాకు సుమారు రూ.30 నుంచి రూ.35 వేల పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తి ధర రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.

ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే

వానాకాలం సీజన్‌లో భాగంగా జిల్లాలో అత్యధికంగా 3.56 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు ఒకేలా కురవలేదు. దీంతో పంట దిగుబడి మండలాలు, భూ రకాల వారీగా హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. రేగడి భూముల్లోని పంట ఎకరాకు 7 క్వింటాళ్ల వరకు వచ్చే సూచనలు ఉండగా చలక, గట్టు భూముల్లో 4, 5 క్వింటాళ్లకు మించదు. పత్తితీత అనంతరం శనగ తదితర పంటలను సాగు చేసి పత్తి దిగుబడిలో వచ్చిన వ్యత్యాసాన్ని పూరించుకోవాలని రైతులు భావిస్తున్నారు.

దిగుబడిపై తీవ్ర ప్రభావం

జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పంట సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement