సౌర విద్యుత్‌కు కేంద్రం ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌కు కేంద్రం ప్రోత్సాహం

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

సంగారెడ్డి: ఇళ్లపై సౌర విద్యుత్‌ పలకలు ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్‌ ముప్త్‌ బిజీలి యోజన’ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కార్యాలయంలో పథకం కరపత్రాలను ఆవిష్కరించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. పథకం కింద నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్‌ పొందే అవకాశం కల్పిస్తున్నారన్నారు. సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని అధికారులు తెలిపారు. పథకం ద్వారా నెలవారీ విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన వినియోగదారులు పథకం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాన్‌న్స్‌కో డీఈఈ నెహ్రూ, ఏడీ లక్ష్మణ్‌, అధికారులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement