సంగారెడ్డి జోన్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుచుకోవా లని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి గాంధీ ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చారని కొనియాడారు. సత్యం, అహింస, శాంతి, స్వ చ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయం ఆవరణలో గాంధీ చిత్రపటానికి ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


