● సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఎంపీ రఘునందన్‌రావు పిలుపు
● లేనిపక్షంలో హైకోర్టుకు లేఖ రాస్తానని వెల్లడి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబాల మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు వార్తల్లోకి రావడం విచారకరమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా నిర్వహించిన కేన్సర్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ తమ ఆస్తులపై విచారణ జరిపించుకునేందుకు స్వచ్ఛందంగా హైకోర్టుకు లేఖ ఇవ్వాలని కోరారు. వారు ముందుకు రాలేని పక్షంలో తానే ఇద్దరి ఆస్తులపై న్యాయ విచా రణ చేయాలని ఉన్నత న్యాయస్థానానికి బహిరంగ లేఖ రాస్తానని తెలిపారు. ఇరు కుటుంబాల ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు మానుకొని ప్రజల ముందు వాస్తవాలను వెల్లడించాలన్నా రు. తన ఆస్తులపై సైతం విచారణకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సింధు, డాక్టర్ స్పందన, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


