పట్టాలెక్కనున్న ప్రగతి | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కనున్న ప్రగతి

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

జహీరాబాద్‌ టౌన్‌: పట్టణాభివృద్ధికి సంబంధించి నిధులు విడుదలయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయి శంకుస్థాపనలు కూడా చేయడంతో త్వరలో పనులు పట్టాలెక్కనున్నాయి. జహీరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 8 అభివృద్ధి పనులకు సంబంధించి రూ.2.09 కోట్ల నగరాభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. 2, 4, 9, 10, 18, 22, 24, 30వ వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా, ఆయా వార్డుల్లో సరైన రహదారులు, మురుగునీటి వ్యవస్థ సరిగాలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో వీధులన్నీ బురదమయంగా మారి దోమల బెడద, దుర్వాసనతో వెదజల్లుతుంది. ప్రజల అవస్థలను గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాణిక్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ యూనూస్‌, కౌన్సిలర్లు ఇటీవల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో పనులను ప్రారంభిస్తామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

రూ.2.09 కోట్లతో అభివృద్ధి పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement