సమస్యల పరిష్కారానికి పోరాటం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి పోరాటం చేద్దాం

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

తెలంగాణ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు అశోక్‌ రావు

తెలంగాణ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు అశోక్‌ రావు

సంగారెడ్డి: సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం చేయాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు అశోక్‌ రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల సర్పంచుల చైతన్య సదస్సు సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, పంచాయతీల బలోపేతం, సర్పంచుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. గ్రామ పంచాయతీలకు 29 అధికారాలు, విధులు, నిధులు బదలాయించాలని, నూతన పంచాయతీలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. తండా లు, కుగ్రామాలకు రోడ్డు సౌకర్యం, స్థానిక పన్ను లు, స్టాంప్‌ డ్యూటీల ఆదాయం పంచాయతీలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర నిధులపై ప్రభుత్వ జోక్యం తగ్గించాలని, గ్రామసభ, గ్రామ పంచాయతీల అధికారాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచుల గౌరవ వేతనం పెంచడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలకు అతీతంగా సంఘటితంగా కృషి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మూడు జిల్లాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement