డీజే ఆపరేట్‌ చేస్తూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

డీజే ఆపరేట్‌ చేస్తూ యువకుడి మృతి

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

గజ్వేల్‌రూరల్‌: డీజే ఆపరేట్‌ చేస్తూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని సింగాటంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొల్గూరు గ్రామానికి చెందిన బండారి లక్ష్మీ–కిష్టయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరి పెద్ద కొడుకు దినేశ్‌(22) డీజే ఆపరేటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27న కొల్గూరుకు చెందిన మరో వ్యక్తి మధుతో కలిసి సింగాటం గ్రామంలో వినాయక నిమజ్జనం ఉండటంతో డీజేను ఆపరేటింగ్‌ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి డీజేను ఆపరేట్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు దిలీప్‌కు సీపీఆర్‌ చేసి గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement