చేగుంట(తూప్రాన్): మాదక ద్రవ్యాలతో జీవనశైలి అస్తవ్యస్తంగా మారుతుందని తూప్రాన్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనీల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం చేగుంట, వడియారం ఉన్నత పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే అనర్థాలను వివరించారు. వ్యసనాలు లేని యువతతో వికసిత భారత్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థులతో నా ఆరోగ్యం – నా గర్వం ప్రతిజ్ఞ, సంతకాల కార్యక్రమంతో పాటు మాదకద్రవ్యాల అనర్థాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వికాస్, ఎంఈఓ నీరజ ఉపాధ్యాయులు లక్ష్మణ్, రఘుపతి, సుధాకర్‌రెడ్డి, రాధ, సరస్వతి పాల్గొన్నారు.


