మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతదేహం లభ్యం

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండలంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 27న సాయంత్రం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఇస్నాపూర్‌ పరిధిలోని ఎన్‌హెచ్‌ – 65 సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి పరిశీలించగా సుమారు 55 ఏళ్ల వయస్సు గల మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులను విచారించగా.. ఆమె కొంతకాలంగా పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతురాలికి సంబంధించిన వారు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement