రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థులు

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

దుబ్బాక: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు దుబ్బాక మైనార్టీ గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మెదక్‌, గజ్వేల్‌లో జరిగిన సెలక్షన్స్‌లో మైనార్టీ గురుకులానికి చెందిన రాంచరణ్‌, విష్ణువర్ధన్‌ అండర్‌–20 విభాగంలో ఎంపికయ్యారు. అక్టోబర్‌ 2 నుంచి వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు సిద్దిపేట, మెదక్‌ జిల్లా జట్ల తరపున ఆడనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్‌ రమేశ్‌, పీడీ షాదుల్‌, మానస అభినందించారు.

ఇద్దరు అదృశ్యం

వెల్దూర్తి(తూప్రాన్‌): కుటుంబీకులతో గొడవపడి వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ ఆదివారం కుటుంబీకులతో గొడవ పెట్టుకొని బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతడి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. అతడి కుమారుడు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటి నుంచి బయటికెళ్లి..

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. కల్హేర్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ కథనం ప్రకారం.. నిజాంపేట్‌ మండలం నాగధర్‌కు చెందిన కంది సుధాకర్‌ హైదరాబాద్‌లో ఫ్లంబర్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్‌ నవరాత్రుల కోసం ఇంటికి వచ్చాడు. ఈ నెల 27న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. యువకుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

లైంగికదాడి కేసులో

మరో నిందితుడి అరెస్ట్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): పట్టణంలో బాలికపై లైంగికదాడి జరిగిన ఘటనకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు తాజాగా ఆదివారం రాత్రి పరారీలో ఉన్న ఓ పార్టీకి చెందిన నాయకుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.

ఆస్పత్రి వ్యవహారంపై సర్కార్‌ సీరియస్‌

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి ఆరోపణలపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల మరణించిన వ్యక్తి మృతదేహానికి చికిత్స పేరిట డబ్బులు వసూలు చేసి, బకాయిల నెపంతో మృతదేహాన్ని, డెత్‌ సర్టిఫికెట్‌ను అప్పగించలేదని బాధిత కుటుంబం నేరుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి, వెంటనే విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సీతారామరాజు నేతృత్వంలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులతో ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. సోమవారం విచారణ బృందం ధ్రువ ఆస్పత్రిలో మృతుడు రాజశేఖర్‌కు అందించిన చికిత్స, కేస్‌షీట్లు, రూ.3.30 లక్షల బిల్లులు, సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement