ఎంపీ సురేశ్ షెట్కార్
జహీరాబాద్ టౌన్: ప్రజా సంక్షేమంతో పాటు పట్టణాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ అభివృద్ధి నిధులు రూ. 2.58 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురికి కాలువల పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజలకు మెరుగైన రవాణ, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి, పార్టీ ఇన్‌చార్జి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణాన్ని అన్నిరంగాల్లో మోడల్‌గా తీర్చిదిద్దడం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యూనూస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ శిరీషారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


