చౌటపల్లిలో క్షుద్ర పూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

చౌటపల్లిలో క్షుద్ర పూజల కలకలం

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని చౌటపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. శుక్రవారం ఆ ఊరి వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ ఘటన వైరల్‌గా మారింది. అయితే చౌటపల్లి స్టేజ్‌ మర్రికుంట కట్ట వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూజలు నిర్వహించినట్లు అటుగా వెళ్లిన పలువురు గుర్తించారు. అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పాటు తదితర వస్తువులు పడి ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు కోరారు.

ఆ ఊరి వాట్సప్‌ గ్రూప్‌ల్లో వైరల్‌

భయాందోళనలో ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement