మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల ఆట పాటలు, శివసత్తుల శిగాల మధ్య అమ్మవారి ఊరేగింపు ఉత్సాహంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజమనోహర శర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక హోమాలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మహిళా భక్తులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


