మెదక్ కలెక్టరేట్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని ఎమ్మెల్యే రోహిత్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ తన సొంత నిర్ణయాలతో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆయన తన సొంత నిర్ణయాలతో ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం


