ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు చేర్యాల విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు చేర్యాల విద్యార్థులు

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు చేర్యాల విద్యార్థులు

చేర్యాల(సిద్దిపేట): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌ 14 కబడ్డీ క్రీడా పోటీల్లో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.నర్సింహచారి శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థులు నితిన్‌, విశాల్‌, జోసెఫ్‌, జోషి పాల్గొని ప్రథమ బహమతి సాధించినట్లు తెలిపారు. వీరిలో నితిన్‌ ఉమ్మడి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు ఫిజికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌, పీఈటీ రేణుకలను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement