అర్బన్‌ ఫారెస్ట్‌ను సందర్శించిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ ఫారెస్ట్‌ను సందర్శించిన విద్యార్థులు

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

తూప్రాన్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తూప్రాన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మెదక్‌ జిల్లాలోని ప్రముఖ నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ను సందర్శించారు. శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి పర్యటనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి అందాలను, దట్టమైన పచ్చదనాన్ని, అక్కడి జీవ వైవిధ్యాన్ని విద్యార్థులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, ప్రకృతి పట్ల మానవునికి ఉండాల్సిన బాధ్యతలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రకృతి పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెరగడమే కాకుండా, తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి, గౌరవం పెరుగుతాయన్నారు. పుస్తకాల్లో చదివే ప్రకృతి, పర్యావరణ పాఠాలను ప్రత్యక్షంగా చూడటం ద్వారా విద్యార్థులకు సబ్జెక్టుపై మరింత లోతైన అవగాహన కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ను సందర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాలుష్యానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించడం మరువలేని అనుభూతిని ఇచ్చిందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement