చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎన్నారై దంపతులు పెడుతల బాలమణి, ప్రతాప్‌రెడ్డి ముందుకొచ్చారు. రైతు వేదికలో మౌలిక వసతులు సరిగా లేవని ఏఈఓ శ్రావ్య, సర్పంచ్ రజిత, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. వారు ఎన్నారై దంపతులు డా.పెడుతల బాలమణి, ప్రతాప్‌రెడ్డికి ఫోన్‌న్‌లో వివరించారు. స్పందించిన వారు రైతు వేదిక చుట్టూ బండలు ఏర్పాటు చేయడంతో పాటు 8 కుర్చీలు, 7 ఫ్యాన్లు, రంగులు, వాష్ రూమ్‌కు కర్టెన్లు, విద్యుత్ ఫిట్టింగ్, తలుపులు, డోర్లకు రంగులు తదితర పనులు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. ఇందుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిపారు. అభివృద్ధికి సహకరించిన ఎన్నారై దంపతులను గ్రామస్తులు అభినందించారు.


