శాకాంబరేశ్వరుడిగా గణనాథుడు | - | Sakshi
Sakshi News home page

శాకాంబరేశ్వరుడిగా గణనాథుడు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

కొనసాగుతున్న గణేశ్‌గడ్డ ఉత్సవాలు

కొనసాగుతున్న గణేశ్‌గడ్డ ఉత్సవాలు

పటాన్‌చెరు టౌన్‌: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో కొలువైన గణేశ్‌గడ్డ దేవస్థానం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని 10వ రోజు శాకాంబేశ్వరుడిగా ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్‌ అసిస్టెంట్లు ఈశ్వర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement