ఎంపీ రఘునందన్‌రావు
పటాన్‌చెరు: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఎంపీ రఘునందన్‌రావు హెచ్‌ఎండీఏ కమిషనర్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ను సోమవారం కలిసి చర్చించారు. అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పటాన్‌్‌చెరు ఎగ్జిట్– 3 నుంచి ఎగ్జిట్–4, సుల్తాన్‌పూర్ మధ్య పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లూరు ఎగ్జిట్–2 వద్ద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.


