35 సీట్లకు 361 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

35 సీట్లకు 361 దరఖాస్తులు

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

మెదక్‌ కలెక్టరేట్‌: పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన స్పాట్‌ అడ్మిషన్లకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్లు ప్రిన్సిపాల్‌ భవాని తెలిపారు. కళాశాలలోని వివిధ కోర్సుల్లో మొత్తం 35 సీట్ల ఖాళీల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించగా 361 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్‌ ఇంజినీర్‌లో 11 సీట్లు, కంప్యూటర్‌ ఇంజినీర్‌లో 3 సీట్లు, ఈసీఈలో 1, ఎస్‌సీటీలో 20 సీట్లు ఖాళీలు ఉన్నాయని, మొత్తం సీట్లను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొని విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లు అందజేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement