దుబ్బాక: తాను చదువు చెప్పే పాఠశాలలోనే తన కూతురిని చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మెరుగు నరేశ్. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూలులో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న మెరుగు నరేశ్ తన కూతురు ఇందిరా సృజితను తాను చదువు చెప్పే సర్కారు బడిలో చేర్పించాడు. 6వ తరగతిలోనే ఆమెను చేర్పించగా ప్రస్తుతం 7వ తరగతి అభ్యసిస్తుంది. ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని ఈ సందర్భంగా నరేశ్ సాక్షితో అభిప్రాయాన్ని పంచుకున్నారు.
– మెరుగు నరేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు.


