ఉన్నతంగా తీర్చిదిద్దుతా.. | - | Sakshi
Sakshi News home page

ఉన్నతంగా తీర్చిదిద్దుతా..

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

ఉన్నతంగా తీర్చిదిద్దుతా..

కొల్చారం(నర్సాపూర్‌): ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కంటే ప్రైవేట్‌ బడిలోనే చదివించేందుకు ఇష్టపడతారు. కానీ మండలంలోని దేశ్యా తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కరుణాకర్‌ తన కుమారుడు అద్వైత్‌ను తాను చదువు చెబుతున్న ప్రభుత్వ బడిలోనే చేర్పించాడు. తాను ఉపాధ్యాయుడిగా శిక్షణ తీసుకున్నది ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికే. అలాంటప్పుడు మా పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దకుండా, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తే మేము పొందిన శిక్షణకు ఎంత మేరకు న్యాయం చేకూరుస్తామన్నది ప్రశ్నగానే ఉంటుంది. అందుకే నా కుమారుడిని సర్కారు బడిలో చేర్పించాను.

– కరుణాకర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement