వర్గల్(గజ్వేల్): నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. అదే చదువుల ఒడి అంటూ నా పిల్లలను సర్కారు బడిబాట పట్టించాను. ఈ కాలంలో ప్రైవేటులో చదివిస్తేనే ‘స్టేటస్’ అనుకుంటున్నారు. ఆ భావన సరికాదు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, చక్కని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లల భవిష్యత్ బాగుంటుంది. ప్రైవేటు స్కూలులో చదువుతున్న తన ముగ్గురు పిల్లలు ప్రదీప్(9వ), ప్రణీత (3వ), హర్షిత్ (2వ)లను గ్రామంలోని సర్కారు బడిలో చేర్పించాను.
– సర్పంచ్ లింగ రవి, చౌదరిపల్లి


