30న సిగాచి బాధితుల సంస్మరణ సభ | - | Sakshi
Sakshi News home page

30న సిగాచి బాధితుల సంస్మరణ సభ

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

సభకు హాజరుకానున్న మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

సభకు హాజరుకానున్న మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు టౌన్‌: సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల స్మారకార్థం ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఇస్నాపూర్‌ బీపీఎల్‌ చౌరస్తాలో సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను పటాన్‌చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆదర్శ్‌రెడ్డి, ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సుమలతతో కలిసి జెడ్పీటీసీ మాజీ సభ్యులు గడీల శ్రీకాంత్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సిగాచి పరిశ్రమ ప్రమాదం దేశ పారిశ్రామిక చరిత్రలో విషాదకర ఘటనగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ సంస్మరణ సభకు మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement