విద్యార్థిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థిని అదృశ్యం అయింది. గురువారం ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన సర్జన శివాని నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శివాని తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో

పటాన్‌చెరు టౌన్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డివిజన్‌ పరిధిలోని లక్కదొడ్డికి చెందిన షాదుల్లా(48) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వ్యక్తుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆయిల్‌ చోరీ

శివ్వంపేట(నర్సాపూర్‌): వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కొంతమంది దుండుగులు ఆయిల్‌ చోరీ చేశారు. మండలంలోని శభాష్‌పల్లిలో వ్యవసాయ పొలాల వద్ద గల 100కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి 240 లీటర్ల ఆయిల్‌తో పాటు కాయిల్స్‌ చోరీ చేశారు. ప్రస్తుతం సాగు పనులు ముమ్మరంగా సాగుతుండగా.. ఆయిల్‌, కాయిల్స్‌ చోరీతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement