కృత్రిమ కాలుకు చేయందించి.. | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ కాలుకు చేయందించి..

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

సిద్దిపేటజోన్‌: చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరుకు చెందిన వరుకోలు మల్లేశం, సాలవ్వ దంపతుల కుమారుడు రంజిత్‌.. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో కుడికాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి మంచానికి పరిమితమయ్యాడు. చేతికి వచ్చిన కొడుకు మంచం బారిన పడడం, కృత్రిమ అవయవ ఏర్పాటు కోసం సుమారు రూ.8 లక్షలు భారంగా మారింది. రెక్కలు ముక్కలు చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి వారిది. విషయాన్ని గ్రామ సర్పంచ్‌ సునీత.. ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిస్థితి వివరించారు..

ఇచ్చిన మాట మేరకు..

ఇటీవల రంజిత్‌ తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి కొడుకు పరిస్థితి వివరించారు. స్పందించిన ఆయన అందుకు అవసరమైన కృత్రిమ కాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజిత్‌కు రూ. 5లక్షల విలువైన కృత్రిమ కాలును అందించి అండగా నిలిచారు.

హరీశ్‌రావు పెద్దమనసు

రోడ్డు ప్రమాదంలోవైకల్యానికి

గురైన వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement