నాచగిరిలో ఇక ఆన్‌లైన్‌ టికెటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నాచగిరిలో ఇక ఆన్‌లైన్‌ టికెటింగ్‌

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

వర్గల్‌(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారం గుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వివిధ సేవల కోసం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సదుపాయం సమకూరింది. దీంతో భక్తజనులు తమ ఇంటి నుంచే ఆయా సేవాటికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే అవకాశమేర్పడింది. గురువారం స్వాతి నక్షత్రం శ్రీనృసింహస్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా క్షేత్రం సందర్శించిన పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మెన్‌ పల్లెర్ల రవీందర్‌గుప్త, ఈఓ రంగాచారిలతో కలిసి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్రారంభించారు. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి రావడంతో భక్తులకు సేవలు మరింత సులభతరమవుతాయని ఈఓ రంగాచారి పేర్కొన్నారు. క్షేత్రం వద్ద నిరీక్షణకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నుంచే సేవలకు సంబంధించి టికెట్లను పొందవచ్చన్నారు. క్షేత్రం సందర్శించిన భక్తులు కౌంటర్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ ‘స్కాన్‌’ చేసి ఆయా టికెట్లు నేరుగా తీసుకోవచ్చన్నారు. https://nacharamguttatemple.telangana.gov.in

వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చని ఆయన సూచించారు.

ప్రారంభించిన మాధవానంద సరస్వతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement