
పర్యావరణ హితం.. మట్టి వినాయకులు
నాలుగు తరాలుగా తయారీలో బ్రహ్మచారి కుటుంబం
కౌడిపల్లి(నర్సాపూర్): మట్టి వినాయకులను నాలుగు తరాలుగా మండల కేంద్రానికి చెందిన అవుసలి బ్రహ్మచారి కుటుంబం తయారు చేస్తోంది. గ్రామానికి చెందిన బ్రహ్మచారి తాత ముత్తాతల నుండి వినాయకులను తయారు చేస్తుండగా నేడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. చెరువు మట్టిని తీసుకువచ్చి వినాయకుడు, ఆవు, ఎడ్లు, బండి తయారు చేస్తారు. గతంతో తయారు చేసిన మట్టి గణపతులను గ్రామస్తులకు ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం రూ.50 వరకు అమ్ముతున్నారు. ఆనవాయితీ, నైపుణ్యాన్ని పడగొట్టవద్దనే ఉద్దేశంతో పండగకు రెండు రోజుల ముందు నుంచి తయారు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో మట్టి వినాయకులు మాత్రం ఉండేవని ప్రస్తుతం రసాయనాలతో తయారు చేసిన వాటిని పూజిస్తున్నారని పేర్కొన్నారు. అవి పర్యావరణానికి హానీ చేస్తాయని తెలిపారు. అయినప్పటికీ మట్టి వినాయకులను ప్రత్యేకంగా తన వద్దకు వచ్చి తీసుకువెళ్లేవారు ఉన్నారని చెప్పారు. అందరూ పర్యావరణ హిత మట్టి గణనాథులను పూజించాలని సూచించారు.

పర్యావరణ హితం.. మట్టి వినాయకులు