
భుజిరంపేటలో రాతి గణపతి
వినాయక చవితితోపాటు ప్రతినెల సంకట చతుర్థి రోజు పూజలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండల పరిధిలోని భుజిరంపేటలో వినాయకుని ఆలయంలోని రాతి గణపతి ప్రతి నెల భక్తుల పూజలందుకుంటుంది. గ్రామంలోని చెరువు అలుగు వద్ద గల సుమారు 75 ఏళ్ల నాటి రాతి గణపతి ఉండగా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి భుజిరంపేటలో శ్రీకృష్ణాశ్రమానికి వచ్చినప్పుడు విగ్రహాన్ని పరిశీలించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన సూచన మేరకు గ్రామస్తులు 2015లో అక్కడే ఆలయం నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి గ్రామ పురోహితుడు జోషి గోపాలశర్మ, గ్రామస్తులు ప్రతినెల సంకట చతుర్థి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, వివిధ గ్రామాలవారు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

భుజిరంపేటలో రాతి గణపతి