ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ పర్యటన | Sakshi
Sakshi News home page

ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ పర్యటన

Published Thu, Nov 23 2023 4:32 AM

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని
పట్టుకున్న ఎకై ్సజ్‌ పోలీసులు   - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: మండలంలోని రుద్రారం గ్రామంలో పటాన్‌చెరు ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ నజీమ్‌ జై ఖాన్‌ బుధవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్‌ స్లిప్పులు వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పంపిణీ చేసిన ఓటర్‌ స్లిప్పులను పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.

23న ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

సంగారెడ్డి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికల సిబ్బందికి ఈనెల 23వ తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణకు విధిగా హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఎన్నికల సిబ్బంది శిక్షణకు హాజరుకానట్లయితే 23వ తేదీన నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు. సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల శిక్షణకు హాజరుకాకున్నా, ఆదేశాలను విస్మరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వారే కీలకం

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దేవుజా

పటాన్‌చెరు టౌన్‌: ఎన్నికల నిర్వహణకు పీఓ (ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌), ఏపీఓ (అసిస్టెంట్‌ ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌) కీలకమని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దేవుజా అన్నారు. బుధవారం పటానన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండో రోజు పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో 465 మందిగాను 16 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ జిన్నారం తహసీల్దార్‌ రవికుమార్‌, ఆర్సీపురం తహసీల్దార్‌ సంగ్రామ్‌ రెడ్డి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌, మాస్టర్‌ ట్రైనర్లు అమరేందర్‌ రెడ్డి, యోగి బాబు, చంద్రారెడ్డి మోహన్‌, ఉమామహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మద్యం పట్టివేత

సంగారెడ్డి టౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు తెలిపారు. బుధవారం సంగారెడ్డి మండలం ఇరుగుపల్లి గ్రామంలో నాగరాజుగౌడ్‌ తరలిస్తున్న 8.640 లీటర్ల మద్యం, మోటార్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణరెడ్డి కాలనీలో మద్యం విక్రయిస్తుండగా భాగయ్య నుంచి 5.40 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారున. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ మాణిక్‌ గౌడ్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రభాకర్‌, రవీందర్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

పటాన్‌చెరు టౌన్‌: గంజాయి విక్రేతను అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ సీతారామిరెడ్డి బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పటాన్‌చెరు శివారులోని కృషి డిఫెన్స్‌ కాలనీలో అలీ గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎకై ్సజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 610 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐలు శ్రీనివాస్‌, రాములు, సిబ్బంది చారి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్న అధికారి
1/1

పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్న అధికారి

 
Advertisement
 
Advertisement