Telangana Crime News: పైళ్లెన ఐదు నెలలకే.. పని చేసుకోమన్నందుకు.. ఇలా చేశాడు!
Sakshi News home page

పైళ్లెన ఐదు నెలలకే.. పని చేసుకోమన్నందుకు.. ఇలా చేశాడు!

Sep 12 2023 5:40 AM | Updated on Sep 12 2023 8:25 AM

- - Sakshi

సంగారెడ్డి: పైళ్లెన ఐదు నెలలకే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని హబ్సిపూర్‌ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్‌(29)కు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. అతని కుడి చేయి కొద్దిగా అంగవైకల్యం ఉంది. ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకోమని తల్లిదండ్రులు చెబుతుండటంతో వారితో తరచూ గొడవ పడేవాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదమం 10 గంటల సమయంలో పొలం దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. మధ్యాహ్నం తన భార్య భారతికి ఫోన్‌ చేసి పైలంగా ఉండు అని చెప్పి కట్‌ చేశాడు. అనుమానం వచ్చి భార్య, బంధువులు పొలం దగ్గర వెతికారు. పక్కనే ఉన్న మంగళి భిక్షపతి బావి దగ్గర చెప్పులు, ఫోన్‌ కనిపించాయి. బావిలో చూడగా ఆనంద్‌ మృతదేహం కనిపించింది. మానసిక, శారీరక పరిస్థితి సరిగాలేక జీవితంపై విరక్తిచెంది మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement