ఏర్పాట్లు చకచకా | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు చకచకా

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

కొడంగల్‌ రూరల్‌/కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ పర్యటన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కలెక్టర్‌ దీపక్‌ తివారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 7వ తేదీ ఉదయం 10.30గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11గంటలకు దుద్యాల మండలం హకీంపేటకు చేరుకుంటారు. 11.10కి మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను, రూ.9,100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఉంటుంది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొంటారు. 3గంటలకు హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 9.15గంటలకు కొడంగల్‌ నుంచి హకీంపేటకు చేరుకుంటారు. 9.30నుంచి 10.20గంటల వరకు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. 10.20గంటలకు పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 10.30గంటలకు లగచర్ల ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.81 కోట్లతో అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. 10.45 జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, బొంరాస్‌పేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పోలీస్‌స్టేషన్‌ను, కొడంగల్‌, పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయాన్ని, దుద్యాలలో పోలీస్‌స్టేషన్‌, సమీకృత మండల కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు –2కు శంకుస్థాపన చేస్తారు. దౌల్తాబాద్‌ మండలం బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొడంగల్‌కు చేరుకుంటారు.

రూ.9,053 కోట్లు.. 13 అభివృద్ధి పనులు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రూ.9053.48కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రేడియల్‌ రోడ్డు –2, రూ.118.80 కోట్లతో పది తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం, రూ.41.83 కోట్లతో కొడంగల్‌, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్‌స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్‌ అకాడమి ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎన్‌ఏసీ సిల్క్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్‌ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. హకీంపేటలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్‌ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తారు.

ప్రారంభోత్సవాలు

రూ.46.08 కోట్లతో నిర్మించిన పది భవనాలను సీఎం ప్రారంభిస్తారు. దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్‌ మ్యూజియం, హకీంపేట జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలు, హకీంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వీటిలో ఉన్నాయి. 9వ తేదీ సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి కొడంగల్‌ నివాసం నుంచి హకీంపేటకు వెళ్తారు. రాత్రి 7గంటల నిర్వహించే రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల నుంచి దాదాపు 50వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపటి నుంచి సీఎం కొడంగల్‌ పర్యటన

రైతుమేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రైతులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం

ఏర్పాట్లను పర్యవేక్షించిన వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement