సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక
అనంతగిరి: ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూరుగుపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అమ్మాయిలు కష్టపడి చదువుకోవాలని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది రాము, ప్రిన్సిపల్ ఉషా కిరణ్ పాల్గొన్నారు.


