కన్నీటి జ్ఞాపకాలు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి జ్ఞాపకాలు

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

సమస్యలు పరిష్కరించండి సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసనలు సోమవారం మిన్నంటాయి. కన్నీటి జ్ఞాపకాలు ధర జిగేలు.. దిగుబడి దిగాలు వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పత్తి పంట సాగు చేసిన రైతులకు ఊహించని విధంగా నష్టం జరిగింది. 8లోu చెల్లి బాధ్యతలు భుజాన వేసుకొని.. బట్టలు కుడుతూ.. బతుకుబండి నడిపిస్తూ.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు అక్కపెళ్లికి వచ్చి ముగ్గురు..

న్యూస్‌రీల్‌

సమస్యలు పరిష్కరించండి సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసనలు సోమవారం మిన్నంటాయి.

మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

బస్సు ప్రమాద ఘటనలో యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందెప్ప, లక్ష్మీ దంపతులు మృతి చెందారు. వారి కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు. 8వ తరగతి చదువుతున్న శిరీష చదువు మానేసి చెల్లి బాధ్యతలు తీసుకుంది. ఒకవైపు కుట్టు శిక్షణ తీసుకుంటూ మరోవైపు రోజువారీ కూలీకి వెళ్తోంది. ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరిందని, వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని బాధిత బాలికలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్న హామీ నెరవేరలేదని వాపోయారు.

కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు

హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 163 ఇరుగ్గా ఉండడంతోపాటు గుంతల కారణంగా ప్రమాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించింది. 18 నెలల్లో పూర్తి చేయిస్తామని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ అప్పట్లో ప్రకటించారు. పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది.

చేవెళ్లలోని మీర్జాగూడ ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్‌ ఢీకొన్న ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద రెండో రోడ్డు ప్రమాదంగా నిలిచిపోయింది. మృతులు, క్షతగ్రాతుల కుటుంబాలు ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. ఎంతో మంది కుటుంబాలకు మానని గాయంగా మారిన ఈ దుర్ఘటన సరిగ్గా ఇదే రోజు (2025 నవంబర్‌ 3)న చోటుచేసుకుంది. తాండూరు, వికారాబాద్‌ నుంచి 72 మంది ప్రయాణికులు ఉద్యోగాలు, చదువులు, బంధువుల వద్దకు ఇలా.. వారివారి పనులకోసం ఎక్కిన బస్సు మృత్యుశకటంగా మారింది.

కంకరలో కూరుకుపోయి..

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా అధిక లోడ్‌తో వచ్చిన కంకర టిప్పర్‌ చిన్న గుంతను తప్పించబోయి బస్సుపై పడిపోయింది. బస్సులో సగానికి పైగా కంకర నిండిపోయి 19 మందిని సజీవ సమాధి చేసింది. కంకరలో సగానికిపైగా ఇరుక్కుపోయిన 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన 19 మంది కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు అందించింది.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఆ ప్రమాదం ఏకంగా 19 మందిని పొట్టనబెట్టుకుంది.. 27 మందిని ఆస్పత్రులపాలు చేసింది.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.. తీరని శోకాన్ని మిగిల్చింది.. చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్‌ ఢీకొన్న విషాదకర ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.. అయినవారిని కోల్పోయిన కుటుంబీకులు ఇది తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

– చేవెళ్ల/తాండూరు/బషీరాబాద్‌/యాలాల/ధారూరు

బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ దస్తగిరి కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది. మొదటి భార్య హసీనా బేగం ఇద్దరు కుమారులతో కలిసి యాలాల మండలం చెన్నారంలో తల్లి ఖాజాబీ వద్ద ఉంటోంది. ఇద్దరు కుమారుల భవిష్యత్తు కోసం ఆమె కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.9 లక్షల పరిహారాన్ని మొదటి భార్య, రెండో భార్య, తల్లికి కుల పెద్దల సమక్షంలో సమంగా అందజేశారు. బస్సు బీమా సాయం అందలేదని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీ నెరవేరలేదని హసీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసిన తనకు ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని వేడుకుంటోంది. మంతట్టిలోని ఇల్లు పూర్తిగా కూలిపోయిందని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతోంది. మరోవైపు దస్తగిరి తల్లి షాకత్‌ బేగం మంచానికే పరిమితం కాగా, రెండో భార్య సాజిదా బేగం ఆమెకు తోడుగా ఉంటోంది.

ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతున్న తమ కూతురు అఖిలారెడ్డి బస్సు ప్రమాదంలో చనిపోవడం నేటికీ తమను కుంగదీస్తోందని యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన మృతురాలి తల్లి అలివేలు కన్నీటిపర్యంతమయ్యారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు కారణంగానే తమ కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదన్నారు. తన కుమారుడికి ఉద్యోగ విషయమై సాయం కోరితే ఇప్పటికీ నెరవేరలేదన్నారు.

ఏడాది క్రితం జరిగిన బస్సు దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా అందులో తాండూరు ప్రాంతానికి చెందిన 14 మంది ఉన్నారు. పట్టణానికి చెందిన ఎల్లయ్యగౌడ్‌కు ఐదుగురు సంతానం. హైదరాబాద్‌లో చదువుకొంటున్న సాయిప్రియ, నందిని, తనూష అక్క పెళ్లి కోసం తాండూరుకు వచ్చి అసువులు బాసారు. నేడు సంవత్సరీకం కావడంతో హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడిని తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్లారు.

తలుచుకుంటే ఇప్పటికీ వణుకు

మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం మరిచిపోలేకపోతున్నా. ఆ దేవుడు దయతో బతికి బయటపడ్డా. ఈ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతోంది. కాళ్లు కంకరలో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీయడంతో గాయాలతో బయటపడ్డాను. నడుము, కాళ్ల నొప్పులు ఇప్పటికీ తగ్గడం లేదు. ఆస్పత్రులకు తిరిగి రూ.లక్షకుపైనే ఖర్చు చేశాను. ప్రభుత్వాలు అందించిన రూ.2.50 లక్షల సాయంతో వైద్య ఖర్చులతోపాటు తీసుకున్న అప్పులు కట్టుకున్నాను.

– నర్సింలు, బాధితుడు, అంతారం, చేవెళ్ల మండలం

ఆరోగ్యం కుదుటపడలేదు

‘బస్సు ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డా. ఏడాది కావస్తున్నా వైద్యం చేయించుకుంటూనే ఉన్నా.. ఇంతవరకు ఆరోగ్యం కుదుటపడలేదు. గర్భసంచి వద్ద రక్తం గడ్డ కట్టింది. మంగళవారం ఆపరేషన్‌ చేయించుకుంటున్నా. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ డబ్బు వైద్యం కోసం వెచ్చించా. ప్రైవేటుగా చూపించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా. ప్రస్తుతం స్వీపర్‌గా పని చేస్తున్నా. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తే అదే కొండంత సాయం’ అంటోంది ధారూరుకు చెందిన నాగమణి.

మీర్జాగూడ ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ప్రమాద ఘటనకు నేటితో ఏడాది

19 మందిని బలిగొన్న కంకర లారీ

అయినవారిని కోల్పోయి బతుకీడుస్తున్న కుటుంబీకులు

ఇప్పటికీ కోలుకోని కొందరు క్షతగాత్రులు

వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement