ఇబ్రహీంపట్నం: ఐదో తెలంగాణ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2026 నిర్వహణపై ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో సోమవారం సీపీ తరుణ్‌జోషి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18, 19 తేదీల్లో క్లస్టర్–బీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో 21 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. క్రికెట్ మైదానాలు, క్రీడాకారుల వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహార ఏర్పాట్లు తదితర అవసరాల గురించి చర్చించారు. టోర్నమెంట్‌ను సక్రమంగా నిర్వహించేందకు పది ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, బాధ్యతలు అప్పగించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోటీలు సజావుగా సాగేందుకు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఏఆర్ అడ్మిన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పోటీల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. సమావేశంలో మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ జోన్ డీసీపీలు నారాయణరెడ్డి, యోగేష్ గౌతమ్, శిరీష, ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ హుస్సైనీ నాయుడు, ఎఫ్‌సీసీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


