గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్ల పరిశీలన

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పరిధిలో నిర్మిస్తున్న స్కిల్‌ యూనివర్సిటీలో త్వరలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను సోమవారం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమ్మిట్‌ ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న గ్లోబల్‌ సదస్సును విజయవంతం చేసేలా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖు లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement