కరాటే పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

కరాటే పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

ఆయిల్‌ పామ్‌ సాగుతో అధిక లాభాలు గంజాయి స్వాధీనం

అభినందించిన బీజేపీ నాయకులు

కొడంగల్‌ రూరల్‌: జాతీయస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో కొడంగల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. సోమవారం పట్టణంలోని మంజూనాథ మినీ ఫంక్షన్‌ హాల్‌లో కేఎస్‌ఎస్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కొడంగల్‌ విద్యార్థులు మెడల్స్‌ సాధించారు. పోటీల్లో నారాయణపేట, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, మోమిన్‌పేట్‌, తాండూరు, కర్ణాటక రాష్ట్రం యాద్గిర్‌, గుర్మిట్‌కల్‌ తదితర ప్రాంతాల నుంచి దాదాపు వందమందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కుమ్మితే(ఫైటింగ్‌) పోటీల్లో రుద్రారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని నందిని ప్రథమ స్థానంలో నిలిచింది. కరాటే కటా చాంపియన్‌ షిప్‌లో చిట్లపల్లి యూపీఎస్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని విజ్ఞత ఫస్ట్‌ ఫేస్‌ చాంపియన్‌ షిప్‌ కప్పు గెలుచుకుంది. సెకండ్‌ ప్లేస్‌లో చాంపియన్‌షిప్‌ కుమ్మితే (ఫైటింగ్‌), కటా పోటీల్లో పెద్దనందిగామ జెడ్పీహెచ్‌ఎస్‌ 10వ తరగతి విద్యార్థిని రియా అజ్మత్‌ రెండు కప్పులు సొంతం చేసుకుంది. మూడో చాంపియన్‌ షిప్‌ కటా పోటీల్లో పెద్దనందిగామ జెడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థిని భానుప్రియ కప్పు గెలుచుకున్నట్లు కరాటే మాస్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. దాదాపు 60మంది విద్యార్థులు గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించా రని తెలిపారు. వీరిని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి, యువమోర్చా జిల్లా ఇన్‌చార్జి శ్వేతాగౌడ్‌, జిల్లా నాయకులు అభినందించారు.

ఉద్యాన శాఖ హెచ్‌ఈఓ రాజు

బంట్వారం: ఆయిల్‌ పామ్‌ సాగుతో అధిక లాభాలు పొందొచ్చని ఉద్యాన శాఖ హెచ్‌ఈఓ రాజు అన్నారు. సోమవారం కోట్‌పల్లి మండలం జిన్నారంలో ఎల్‌నినోపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఆయిల్‌ పామ్‌ మొక్కలకు డ్రిప్‌తో నీరు పారించాలన్నారు. పంట సాగు చేస్తే ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హుస్సేన్‌, రైతలు భుజంగరెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.

నవాబుపేట: అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గిరి కథనం ప్రకారం.. జీడిమెట్ల నటరాజ్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ ముస్తఫా బస్టాండ్‌ వద్ద సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌లో వంద గ్రాముల గంజాయి లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement