సంస్కృతిని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

సంస్కృతిని కాపాడుకుందాం

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

నవాబుపేట: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అవదూత గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. సోమవారం నవాబుపేటలో హిందూ జనశక్తి ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన అతిథి గో క్షేత్రం, దేవతామూర్తుల స్థాపన కార్యక్రమాన్ని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతిలో గోవుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందన్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణలో గోవుల పాత్ర ఎంతో కీలకమన్నారు. గోసేవ ధార్మిక కార్యక్రమం కాదని, అది సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. పాలు ఇవ్వని, వృద్ధాప్యంలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న గోవులకు గోశాలలు ఆశ్రయం కల్పిస్తాయన్నారు. గోశాలలు స్వయం సమృద్ధి సాధించే విధంగా అభివృద్ధి చెందాలన్నారు. అంతకుముందు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. గో సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గోశాలలు మన సంస్కృతి, సంప్రదాయాలు, వేదాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించేలా పని చేయాలన్నారు. కార్యక్రమంలో హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు లలిత్‌కుమార్‌, నాయకులు కరుణాకర్‌, శ్రీనివాస్‌, కళ్యాణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్‌ యాదవ్‌, సర్పంచులు శ్రీధర్‌, నర్సింహారెడ్డి, నర్సింలు, ప్రభాకర్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణం

అవదూత గణపతి సచ్చిదానంద స్వామి

గో సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement