ఆలూరులో డేటా సెంటర్‌తో నష్టమే | - | Sakshi
Sakshi News home page

ఆలూరులో డేటా సెంటర్‌తో నష్టమే

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

లక్డీకాపూల్‌: ఆలూరులో డేటా సెంటర్‌ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు నష్టమేనని, జీవితాలు నాశనమవుతాయంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌తో 3, 4 డిగ్రీల మేర ఎండ పెరిగే ప్రమాదం లేకపోలేదన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం అలూరు రైతుల అరిగోస పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రత్నంతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ భూములు చాలా ఉండగా రైతుల భూములను గుంజుకుంటామంటే సహించేది లేదన్నారు. తాతల నుంచి పండించుకున్న 1,248 ఎకరాల పట్టభూములపై ప్రభుత్వం సైలెంట్‌ స్కెచ్‌ వేసిందని ఆరోపించారు. ఇనామ్‌ భూములుగా పహాణి పొందిన వ్యవసాయ భూములను వక్ఫ్‌ భూముల పేరిట అధికారులు రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అదేమంటే పాన్‌ మక్త భూములుగా పేర్కొంటూ.. బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారన్నారు. ఆ భూములే కావాలంటే మార్కెట్‌ విలువకు మూడింతలు అదనంగా రైతులకు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలన్నారు. అలూరు రైతులు అంజయ్య, కృష్ణ, రాజు, కసిర్రే వెంకటేశ్‌, బర్ల బుచ్చయ్య, రమేష్‌, మాణిక్యం, పుప్పాల సాయన్న మాట్లాడుతూ.. తమ భూములు తమకే కావాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో హైకోర్ట్‌ ఆర్డర్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement