ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్ఎంసీ పరిధి నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధి లోపల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ మంజూరు చేయాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు 24 శాతం ఇంటి అద్దె భత్యం మంజూరు చేసే అంశాన్ని పరిశీలించి, ఆర్థిక శాఖ అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. గతంలో జీహెచ్ఎంసీ నుంచి 8 కిమీ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేసేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం ఉందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేందర్‌రెడ్డి, రమేష్‌గౌడ్, శ్రీనేష్‌కుమార్ నోరీ, నూతనకంటి వెంకట్, శాంతిశ్రీ, రేవతి, నర్సిరెడ్డి, రాకేష్, శ్రీనివాస్, సైదమ్మ, అనిత, నాగేశ్వర్రావు, మహేశ్, బాలేశ్వరి, జ్యోత్స్న, రాణి, ప్రమీల, రంగయ్య, గోపాల్ నాయక్, శ్రీధర్‌రెడ్డి, శేఖర్, వాణి, గౌస్, తేజ, రాములు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్‌కు ఉద్యోగుల జేఏసీ నేతల వినతి


