ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు సాధిద్దాం

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

ఇబ్రహీంపట్నం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికల ఇన్‌చార్జి, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఆ పార్టీ జిల్లా ఽఅధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రులను కలుసుకొని, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పట్టభద్రుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, నాయకులు దండెం రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement