సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

పహాడీషరీఫ్‌: ఫ్యూచర్‌ సిటీకి ముఖద్వారంగా ఉన్న పహాడీషరీఫ్‌ ప్రాంతాన్ని నేరరహిత ప్రాంతంగా ఉంచడం ద్వారా గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ బి.రాజేష్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రీమియర్‌ ఎనర్జీస్‌, రేడియంట్‌ టెక్నాలజీస్‌ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను పహాడీషరీఫ్‌ దర్గా వద్ద మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ.. సున్నితమైన పహాడీషరీఫ్‌ ప్రాంతంలో ఇరువర్గాల ప్రజలు పరస్పర సహకారంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం శుభసూచకమన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమనేది పోలీస్‌ శాఖతో పాటు ప్రజల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు ఏదైనా నేరం జరిగినా కచ్చితమైన నిందితులను గుర్తించేందుకు వీలుంటుందన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన రెండు సంస్థలను ఆయన అభినందించారు. వీటి ఏర్పాటు ద్వారా నిఘా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు. గతంలో శంషాబాద్‌ జోన్‌ పరిధిలోకి వచ్చే జహంగీర్‌ పీర్‌ దర్గా పునర్విభజనలో పక్క కమిషనరేట్‌లోకి వెళ్లగా, ప్రస్తుతం పహాడీషరీఫ్‌ దర్గా హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోకి రావడం హర్షణీయమన్నారు. అనంతరం ఆయన దర్గా పైకి ఎక్కి పూలు, ఛాదర్‌ సమర్పించారు. కార్యక్రమంలో శంషాబాద్‌ డివిజన్‌ ఏసీపీ వి.శ్రీకాంత్‌ గౌడ్‌, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ డెబోరా, ఎస్‌ఐలు ఫైజల్‌ అహ్మద్‌, దయాకర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌, స్థానిక నాయకులు అబ్దుల్లా బిన్‌ అవద్‌, పందెం కొండల్‌ యాదవ్‌, షేక్‌ అఫ్జల్‌, దస్తగిర్‌, సూర్యగౌడ్‌, మక్దూం పటేల్‌, హాజీ తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement