బీజేపీని అఽధికారంలోకి తేవడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీని అఽధికారంలోకి తేవడమే లక్ష్యం

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

కడ్తాల్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్‌ అన్నారు. ఈ నెల 31న మైసిగండిలోని ఎంజీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించనున్న గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం మైసిగండిలోని కన్వెన్షన్‌ హాలులో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిలాల్‌నాయక్‌ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవినాయక్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జాతీయ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మన్నాలాల్‌ రావత్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, గోడం నగేశ్‌, డీకే అరుణ, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అత్యధిక సంఖ్యలో గిరిజన నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు భగీరథ్‌, మండల అధ్యక్షుడు మహేశ్‌, నాయకులు ప్రేమ్‌రాజ్‌, మునేశ్‌నాయక్‌, రాజునాయక్‌, సురేశ్‌, కల్యాణ్‌, జంగం వెంకటేశ్‌, అంజయ్య, శ్రీకాంత్‌, దస్రు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement