అబ్దుల్లాపూర్‌మెట్ : పెద్ద అంబర్‌పేటలోని రాజశ్రీ విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. శ్యామ్, తరుణ్, వైష్ణవి సెప్టెంబర్ 27న బాచుపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి సెలక్షన్ ట్రైల్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ పోటీలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఈనెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సిద్దెంకి జగన్ మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజరాజేశ్వరి, పాఠశాల కోచ్ గోపి, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీ సాయినికేతన్ విద్యార్థి ఎంపిక
మండల కేంద్రంలోని శ్రీ సాయినికేతన్ హైస్కూల్ విద్యార్థి సల్మాన్ ఖాన్ జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. కోల్‌కతాలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ కోటా భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్‌ను కరస్పాండెంట్‌తోపాటు ప్రిన్సిపాల్ గీత, కోచ్ నీలేష్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించారు.


