ఉమ్రాయాత్రకు వెళ్లివస్తూ.. అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

ఉమ్రాయాత్రకు వెళ్లివస్తూ.. అనంత లోకాలకు

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

షాద్‌నగర్‌రూరల్‌: ఉమ్రాయాత్రకు కుటుంబంతో కలిసి వెళ్లారు.. యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన మహమూద్‌, రజియాబేగం కొన్నేళ్ల క్రితం షాద్‌నగర్‌ పట్టణానికి వచ్చి ప్యారడైజ్‌కాలనీలో స్థిరపడ్డారు. ఇటీవల రజియాబేగం(56)కు గుండె సంబంధిత సమస్య రావడంతో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత భర్త మహమూద్‌, బంధువు ఇబ్రహీంతో కలిసి ఈ నెల 11న ఉమ్రాయాత్రకు బయలుదేరారు. సౌదీలో ముస్లిం తెగలమధ్య యుద్ధం జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. దీంతో ఈ నెల 24న తిరిగి రావాల్సిన వారి కుటుంబం అక్కడే చిక్కుకుపోయింది. ఈ నెల 26న ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు సౌదీ నుంచి దుబాయ్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చేందుకు అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కగానే మరోసారి రజియాబేగం గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం స్పందించాలని, విదేశాంగ మంత్రి జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement