కొందుర్గు: కొందుర్గులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన దుర్గని రామయ్య పొలంలో గుంతలు తవ్వారు. పక్కనే చెట్టుకింద కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, కుండ, అగర్‌బత్తీలు తదితర పూజాసామగ్రి ఉన్నాయి. దీంతో పరిసర పొలాల రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయమై తగిన విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
షాద్‌నగర్: ఫరూఖ్‌నగర్‌లోని హజ్రత్ సయ్యద్ షా అలీ అక్బరుద్దీన్ ఖాద్రీ దర్గాలో ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బదర్ ఉల్ మషాయిఖ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంధోత్సవం, చాదర్ సమర్పణ, మహ్పిల్ ఏ నాత్ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
షాద్‌నగర్: జూనియర్ సివిల్ జడ్జి పరీక్షా ఫలితాల్లో సత్తాచాటి న్యాయమూర్తిగా ఎంపికై న షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఆగీరు లక్ష్మీప్రసాద్‌ను బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. లక్ష్మీప్రసాద్ తల్లిదండ్రులు వెంకటేశ్, చంద్రకళను శాలువా, పూల మాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, నాయకులు రవికుమార్‌గుప్త, కృష్ణ, గుట్ట రాజు, రాజు నాయక్, శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం గర్వకారణమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె బాబయ్య అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న పాలమూరు ప్రాంతంలో జన్మించి నిజాం పాలనలో భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రజావీరుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఆయన జీవితం ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నింపిందని తెలిపారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందన్నారు. గురువారం షాద్‌నగర్‌లో నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి వేడుకలకు ముదిరాజ్ సంఘం నాయకులతో పాటుగా, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.
రాజేంద్రనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం తెల్లవారు జాము న 3.30 గంటలకు హైదర్ గూడ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియ ని మహిళ మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


