వారసత్వానికి సొబగులు | - | Sakshi
Sakshi News home page

వారసత్వానికి సొబగులు

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

అడాప్ట్‌–ఎ–హెరిటేజ్‌..

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే చారిత్రక కట్టడాలు, ప్రాంతాల పరిరక్షణ, నిర్వహణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్‌ పరిధిలో ‘హెరిటేజ్‌ కమిటీ’ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఔటర్‌ వరకూ విస్తరించిన క్యూర్‌లో చారిత్రక సంపదను కాపాడటం, సంరక్షించడం, క్రమబద్ధీకరించడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. అలాగే చారిత్రక సంపద నిర్వహణ, ప్రమోషన్‌ కోసం ప్రభుత్వం సస్టయినబుల్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చరల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణ, పునర్వినియోగ పనులను ప్రోత్సహించేందుకు కేసులను బట్టి పన్నులు, ఫీజులు, చార్జీలలో సబ్సిడీలు లేదా రాయితీలు కల్పిస్తారు.

కమిటీ ఏం చేస్తుందంటే..

వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల మధ్య సమన్వయాన్ని కుదురుస్తూ హెరిటేజ్‌ కమిటీ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. చారిత్రక ప్రాంతాలలో జరిగే అభివృద్ధి, పునరాభివృద్ధి పనులపై కమిటీ మార్గదర్శకాలను అందిస్తుంది. వారసత్వ కట్టడాలపై ప్రభావం చూపే ఎలాంటి అభివృద్ధి పనులకై నా హెరిటేజ్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించడం తప్పనిసరి. కమిటీ తన విధులను నిర్వహించడానికి అవసరమైన రికార్డులు, మ్యాపులు, పత్రాలను ఏ శాఖ నుంచి అయినా సుమోటోగా లేదా ప్రత్యేక ంగా ఆదేశించి నిర్ణీత గడువులోగా సేకరించవచ్చు.

అనుమతి లేని ప్లాస్టరింగ్‌, పెయింటింగ్‌ నిషేధం

చారిత్రక కట్టడాల రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు. కమిటీ ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి చారిత్రక కట్టడాల పరిరక్షణ, కూల్చివేత, సైట్‌ డెవలప్‌మెంట్‌, సివిల్‌ పనులు, మార్పులు చేర్పులు, మరమ్మతులు, పునరుద్ధరణలు చేయకూడదు. ఆఖరికి పెయింటింగ్‌ వేయడం, ప్లాస్టరింగ్‌ చేయడం, ఆర్కిటెక్చరల్‌ ఫీచర్లను మార్చడం వంటివి కూడా కమిటీ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు.

క్యూర్‌ హెరిటేజ్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వ అడుగులు

చారిత్రక కట్టడాల దీర్ఘకాలిక నిర్వహణ కోసం కమిటీ పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లను ప్రోత్సహిస్తుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) ప్రాజెక్ట్‌లు, అడాప్ట్‌–ఎ–హెరిటేజ్‌ కార్యక్రమాలను అందిస్తుంది. ఈ కమిటీ ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలతో ఎలాంటి భాగస్వామ్యాలు కుదుర్చుకున్నప్పటికీ.. చారిత్రక కట్టడాలపై లేదా ల్యాండ్‌లపై ఎలాంటి దీర్ఘకాలిక లేదా యాజమాన్య హక్కులు వారికి సంక్రమించవు. సదరు కట్టడాలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. హెరిటేజ్‌ కమిటీకి, దాని పరిధిలోని వ్యక్తులకు గానీ చారిత్రక సంపదను అమ్మడానికి, బదిలీ చేయడానికి, లీజుకు ఇవ్వడానికి, తాకట్టు పెట్టడానికి లేదా థర్డ్‌ పార్టీకి ఎలాంటి హక్కులు కల్పించడానికి చట్టబద్ధమైన అధికారం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement